NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం చెందారు
23/12/2022 శుక్రవారం రోజున సిక్కిం లో చాలా విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. 16 మంది సైనికులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు మరియు 4 సైనికులు గాయాలపాలయ్యారు.
ఉదయం తూర్పు సిక్కిం లోని ఛత్తాన్ లో బయలుదేరి థంగు వైపు 3 వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా జీమాలో మలుపునును దాటే సమయంలో బాగా ఏటవాలుగా ఉన్న ఒక కొండ పై నుండి ఒక వాహనం జారి పడిపోయింది.
ఈ ప్రమాదంలో 3 జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తో సహా మొత్తం 16 మంది సైనికులు దుర్మరణం చెందారు.మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన నలుగురిని వాయు మార్గంలో వైద్యం కోసం తరలించారు.
ఈ సంఘటన గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి ముర్ము గారు దిగ్భ్రాంతికి గురయ్యారు.వారి సంతాపాన్ని తెలియజేశారు.
రాజ్నాథ్ సింగ్:
నార్త్ సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.
వారి సేవ మరియు నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
నరేంద్ర మోడీ:
సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మన వీర సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
ముర్ము:
సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సైన్యానికి చెందిన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గురించి తెలుసుకుని బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మన సైనికుల ఆత్మలకి శాంతి చేకూరాలని ఆశిస్తూ ధీర సైనికా... నీకు వందనం.... ఓం శాంతి.....
మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
0 $type={blogger}